యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం, తిమ్మాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని లబ్ధిదారులకు యాటపోతు, బట్టలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించిందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసుకున్న వారికి ఇచ్చిన మాట ప్రకారం యాటపోతూ, బట్టలను అందజేస్తున్నానని తెలిపారు.