శ్రీ సత్య సాయి జిల్లా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హిందూపురం వైయస్ రాజశేఖర్ రెడ్డి బస్టాండ్లో హిందూపురం వైసిపి సమన్వయకర్త దీపిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం, 108 ఆరోగ్యశ్రీ, ఫీజు మెంబర్స్ మెంట్ పథకాల ద్వారా పేద ప్రజలను బ్రతుకుల్లో వెలుగు తెచ్చిన దేవుడని కొనియాడారు. మహానేత ప్రారంభించిన పథకాల ద్వారా పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని ఎంతో ఎత్తికి ఎదిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలోహిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.