ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల కెమికల్స్ వల్ల నీరు పూర్తి గా కలుషితం అవుతుందని కావున ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను పూజించాలని నవీపేట ఎస్సై తిరుపతి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కావున మట్టి గణనాథులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు.