అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం దోమల నివారణకు గాను మలాథియాన్ లాంటి క్రిమిసంహారక మందులను ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఎంపీడీవో బివి రవి ప్రసాద్, వైద్యాధికారులు పావని వెంకటేష్ నాయక్ ల ఆధ్వర్యంలో గ్రామాల్లో పిచికారి చేయించారు. మండలంలోని రాకెట్ల షేక్షానుపల్లి, షేక్షాను పల్లి తండా, మైలారం పల్లి, కోనాపురం, రాచేపల్లి గ్రామాల్లో దోమల నివారణకు మలాథియాన్ పిచికారి చేయించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రేమతో గా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.