సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేసి, ఓపి రిజిస్టరు రాయడంలో తగు సూచనలు చేశారు. ఎంపీడిఓ తరుచూ పర్యవేక్షణ చెయ్యాలని సూచించారు. జనాలకు వైద్య సేవలు అందివ్వడమే తమరి యొక్క ముఖ్యమైన విధి అని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జ్వరం వలన అసువత్రికి వచ్చిన వారితో మాట్లాడుతూ పిల్లలకు కాచి చాలార్చిన నీటినే తాగించాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమాన్ని జిల