కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వినాయకుని నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసినట్లు శనివారం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. నిమజ్జనం కోసం పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో పూర్తిగా విజయవంతం చేసిందని తెలిపారు. నిమజ్జనం కోసం శోభయాత్రగా వెళ్లే గణపతి లతోపాటు పోలీసులు కూడా అడుగడుగునా అంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారని, ముఖ్యంగా మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షించినట్లు తెలిపారు. విజయవంతం కావడం పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, ఇతర శాఖల అధికారులను సిపి అభినందించారు.