సిరికొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో శుక్రవారం చెలిమి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖధికారి రాములు, విశిష్ట అతిథిగా పెద్దవాల్గోట్ ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి పాల్గొన్నారు. దీనిలో భాగంగా చెలిమి యొక్క ఆవశ్యకత గురించి ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి పిల్లలకు వివరించారు. మానవ సమాజంలో మనం ఒంటరి వారం కాదు, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక సమస్యకు సమాధానం కొరకు చెలిమి అనేది తప్పనిసరిగా ఉండాలని సూచించారు. మండల విద్యాశాఖధికారి మాట్లాడుతూ పిల్లలందరూ తమ తోటి విద్యార్థులతో ఎప్పుడు చెలిమితో ఉండాలని సూచించారు.