ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ బంక్ సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. నడిరోడ్డుపై పడటంతో కొట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో సాగర్ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి క్రేన్ సహాయంతో బోల్తా పడిన వాహనాన్ని పక్కకు తీశారు. అనంతరం ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.