నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి పోలీసులు ఆదివారం మధ్యాహ్నం తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి చౌరస్తాలో శుక్రవారం నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధా యాచకురాలు తీవ్రంగా గాయపడగా, 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఋతురాలు ఆకుపచ్చ పువ్వులు ఉన్న చీర ధరించి ఉందని, ఆమె కుడి చెయ్యి విరిగి వేలాడుతుందని పోలీసులు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిసినవారు ఎస్సై నెం. 8712670226 లేదా సీఐ నెం. 8712670158 నెంబర్ల కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.