ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా చేపట్టిన పునఃనిర్మాణ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, రైతులకు అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ పునఃనిర్మాణం చేపట్టిన ఆధునిక నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.