జనగామ జిల్లా పాలకుర్తి మండలం లోని ఖుషి గుట్ట ఏరియాలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురిని పాలకుర్తి పోలీసులు బుధవారం సాయంత్రం పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.నిందితుల వద్ద నుండి 1 కేజీ 300 గ్రాముల ఎండు గంజాయి,ఓ ద్విచక్ర వాహనం,6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పాలకుర్తి సీఐ జానకిరామ్ తెలిపారు.