తాండూరు మండలం బోయపల్లిబోర్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిలి మల్లేష్ అనే యువకుడు మృతి చెందినట్లు తాండూరు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం పంజాబీ దాబా నుండి బిర్యానీ తీసుకొని మోటార్ సైకిల్ పై రోడ్డు వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు మృతుడి స్వస్థలం ఓదెలు కాగా ఉపాధి కోసం కాసిపేట గ్రామంలో నివసిస్తున్నట్లు తెలిపారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు