హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఈనెల 10న జరగనున్న సంచార జాతుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్ పిలుపునిచ్చారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్న సంచార జాతుల ప్రజల అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు వారి అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు