భూ భారతి ద్వారా రైతులకి మెరుగైన సేవలు అందించటం జరుగుతుందని, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేయనుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. బుధవారం నూతనకల్ మండలం తాళ్ళసింగారంలో జరుగుతున్న రెవిన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తాళ్లసింగారం గ్రామంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సుల ద్వారా 233 మంది ధరఖాస్తులు అందినట్లు తెలిపారు.