స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచేలా కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన 'సేవ పక్వాడ్ ఖేలో పార్లమెంట్' కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా, రాబోయే ఎన్నికల్లో ప్రతి స్థానంలోనూ బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు పట్టుదలతో పనిచేయాలని ఆమె కోరారు.