సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో శుక్రవారం 11: 45 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి మండల కేంద్రంలో పరిటాల రవీంద్ర 67వ జయంతిని పురస్కరించుకుని ముందుగానే నందమూరి తారక రామారావు పరిటాల రవీంద్ర కాంస్య విగ్రహాలను ఆవిష్కరించడం జరిగిందని రానున్న రోజుల్లో ఇదేవిధంగా పరిటాల రవీంద్ర జయంతిని ఘనంగా నిర్వహించి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ సిద్ధార్థ టీడీపీ నేతలు పాల్గొన్నారు.