విద్యారంగం లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు తక్షణమే చెల్లిచాలని పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థి పోరుబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా ఛలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృద్వి మాట్లాడుతూ.... తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండేళ్లు అవుతున్నా రేవంత్ సర్కార్ విద్యార్థుల సమస్యలు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.