వరుణుడు కరుణించాలని.. విస్తారంగా వర్షాలు కురవాలని వరుణ యాగాలు చెయ్యటం చూసాం. వరుణ జపాలు గురించీ విన్నాం. అధునాతన పద్దతుల్లో మేఘాలను మదించటం కూడా అందరికీ తెలిసిందే. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసులు వినూత్నంగా పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిఏటా వానదేవుడి కరుణ కోసం ఎక్కడలేని సాంప్రదాయం ప్రకారం "బుడ్ బావే.. పెర్సా బావే.." అనే పూజా కార్యక్రమాన్ని చేపడతారు.