నల్లగొండ జిల్లా అనుములలో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి రైతులు వ్యవసాయ సహకార సంఘం వద్ద బారులు తీరారు. క్యూలో నిలబడలేక అన్నదాతలు తమ చెప్పులు పేపర్లు ఆధార్ కార్డు వరుసలో పెట్టి అధికారులు వచ్చేవరకు ఎదురుచూశారు .తమను ఇబ్బందులకు గురి చేయకుండా యూరియా అందించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.