పలమనేరు: దక్షిణ కాశీగా పేరు ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి ఆదివారం కేరళ రాష్ట్రం పరుశురాం క్షేత్రం నుండి నూతన ధ్వజస్తంభం పలమనేరుకు ఆగమనం. దీంతో పలమనేరు పట్టణ భక్తాదులు పసుపు నీళ్ళు పాలతో ధ్వజస్తంభాన్ని కడిగి శుద్ధి చేసి, పసుపు కుంకుమ పూలు పెట్టి ధ్వజస్తంభ ఆగమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి పలమనేరు పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా కాశీ విశ్వేశ్వర దేవాలయానికి ధ్వజస్తంభం చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు ఆలయ కమిటీ సభ్యులు నూతన ధ్వజస్తంభం ప్రాశస్యం గురించి వివరించారు.