నల్గొండ మండల పరిధిలోని మేళ్ల దుప్పలపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట్ అనే యువకుడు మృతిచెందగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.