కర్లపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం కలెక్టర్ వెంకట మురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో విద్యాబోధన ఎలా ఉంది ఎలా చదువుకుంటున్నారు అని కలెక్టర్ వెంకట మురళి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని మెరుగ్గా చదివి ఉత్తమమైన ఫలితాలు సాధించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.