అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషన్ కళాశాలలో విద్యార్థినిలకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలు గురించి అవగాహన సదస్సును బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రెక్టార్ ప్రొఫెసర్ వెంకట నాయుడు రిజిస్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ కాబోయే టీచర్లైన ఎడ్యుకేషనల్ కళాశాలలో విద్యార్థినిలకు డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు గురించి ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని. ఎస్కే యూనివర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ వెంకట నాయుడు రిజిస్టర్ రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు మురళీధర్ రావు పాల్గొన్నారు.