కరీంనగర్ జిల్లా,రామడుగు మండలo,కిష్టాపూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పిస్తూ అదుపుతప్పి పడిపోయిన ద్విచక్ర వాహనదారుడు సురేందర్ రెడ్డి కి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం 5:50 PM కి చోటుచేసుకుంది,రామడుగు నుండి కరీంనగర్ వెళ్తున్న సురేందర్ రెడ్డి కిష్టాపూర్ గ్రామ శివారు వద్దకు రాగానే,ఎదురుగా ప్యాసింజర్లతో కూడిన ఆటో వేగంగా వస్తుండగా గమనించిన సురేందర్ రెడ్డి దాన్నుండి తప్పించుకునే ప్రయత్నంలో వీధి కుక్కలు కూడా వెంబడించడంతో అదుపుతప్పి పడిపోయాడు,సురేందర్ రెడ్డి ఎడమ కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి,స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు,