కామారెడ్డి జిల్లా కేంద్రంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. బార్ అసోసియేషన్ అధ్యక్య, ప్రధాన కార్యదర్శులు నంద రమేష్, బండారి సురేందర్ రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ పిలుపు మేరకు కొన్ని డిమాండ్ లతో కూడిన కరపత్రాన్ని బుధవారం కామారెడ్డి బార్ అసోసియేషన్ హాల్ లో ఆవిష్కరించారు. బార్ కౌన్సిల్ ఎలక్షన్లు వెంటనే నిర్వహించాలని, న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని గత 6 సంవత్సరాల నుండి ఎలక్షన్లు నిర్వహించకపోగా న్యాయవాదులు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసును జవాబు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వాళ్ల పదవి పొడగించుకొనుటకు చేస్తున్నటువంటి ప్రయత్నం అన్నారు.