కలిదిండిలో దివంగతనేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా విగ్రహానికి జరిగిన అవమానంపై దర్యాప్తు కొనసాగుతోందని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. కైకలూరు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ పాల్గొని మీడియాతో మాట్లాడారు. రంగా విగ్రహానికి పేడ పూసి అవమానించిన నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. కైకలూరు రూరల్ సీఐ వీరరవికుమార్ పాల్గొన్నారు.