స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మేదర కులస్తులు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర మేదరి (మహేంద్ర) సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేపీ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం బర్కత్ఫురాలో ఆయన సమావేశం నిర్వహించారు. రాజకీయంగా రాణించినప్పుడే మేదర్ల అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, శ్రీధర్, మహేశ్, తుమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు