ఈనెల 26న సిరిసిల్లలో తలపెట్టిన మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణకు అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి రావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధి పర్ష హనుమాన్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 26న సిరిసిల్లలో మహాత్మ జ్యోతిబా,సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.గత 20 సంవత్సరాలుగా సిరిసిల్లలో వారి విగ్రహాలు ఏర్పాటు కోసం బీసీ సంక్షేమ సంఘం ఎమ్మెల్యేలు పోరాటం చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి సిరిసిల్లలో ఏర్పాటుకు ముందుకు రావడం హర్షనీయమన్నారు. వారి ఆశా సాధన కో