వినాయకుని కరుణా, కటాక్షాలతో నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకాంక్షించారు. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలోని కౌన్సెల్ సమావేశ మందిరంలో బుధవారం వినాయక చవితి వేడుకలు జరిగాయి. వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొని వారి మొక్కులు తీర్చుకున్నారు.