నిజామాబాద్ జిల్లాలో ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. డిచ్పల్లి మండలంలోని బీబీపూర్ తండా 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. డిచ్పల్లి వైపు వస్తున్న ఓ లారీ అదుపు తప్పి రోడ్డు కిందకు ఒరిగింది. ఘటనలో డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిచ్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో లారీ మందు భాగం కొంత మేరకు ధ్వంసం అయింది.