నరసాపురం పట్టణం 28వ వార్డులో మున్సిపాలిటీకి చెందిన తుంగపాటి చెరువుగట్టు స్థలాన్ని డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, పర్యావరణహితంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణ శుభ్రతకు ఇది తోడ్పడేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నాయకర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్య మరియు నియోజకవర్గ జనసేన, టిడిపి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.