సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జనోత్సవం శనివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాధుడిని అందంగా అలంకరించిన రథంలోకి చేర్చి, నిమజ్జనానికి తరలించారు. శోభాయాత్ర సందర్భంగా దారి పొడుగున కలెక్టరేట్ లోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు భక్తి గీతాలు ఆలపిస్తూ, భజనలు చేస్తూ ఆనందోత్సాహంతో నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఇతర అధికారులు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు.