రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 11వ తేదీన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అన్నిశాఖల జిల్లా అధికారులతో సోమవారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు.మడ అడవుల అభివృద్ధిలో భాగంగా సూర్యలంక బీచ్ వద్ద మడ మొక్కలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నాటుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.మంత్రి పర్యటన సజావుగా సాగడానికి సమగ్ర ప్రణాళికతో అధికారులు ముందుకు సాగాలని ఆయన ఆదేశించారు.గట్టి భద్రతా ఏర్పాట్లు చేయవలసిందిగా ఎస్పీకి సూచించారు