అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ రైతన్నలు శనివారం రోడ్డేక్కారు.ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువు నుండి తూములు ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్ పై బైఠాయించి నిరసన తెలియజేశారు.గత 15 రోజుల నుండి చెరువు వద్ద తూములు రిపేర్లు వచ్చి పంట పొలాలకు నీరు రావటం లేదని దీనితో పంట పొలాలు ఎండిపోతున్నాయని ఇరిగేషన్ అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని,కళ్ళ ముందు పంట నాశనం అవుతుంటే చూడలేక ఆందోళన చేస్తున్నామని రైతులు వాపోయారు.. విషయం తెలుసుకుని అక్కడి చేరుకున్న ఇరిగేషన్ అధికారులను రైతులు నిలదీశారు..