కామారెడ్డి : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము జనహిత గణేష్ మండలి 9వ వార్షికోత్సవమును పురస్కరించుకొని మంగళవారం రోజున జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము నందు కార్యాలయ ఉద్యోగులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు ఉద్యోగులకు మట్టి గణపతుల పంపిణీ చేయడం జరుగును. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.