వర్షముల కోసం రైతుల నుండి బలవంతపు భూసేకరణ చేయొద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అతివేల మానిక్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిదేవుని పల్లి లోని సాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమికోసం భుక్తి కోసం వెట్టిచాక విముక్తి కోసం జరిగిన పోరాటంలో 10 లక్షల భూమిని పంచారని అన్నారు. అదే స్ఫూర్తిగా మునిదేవునిపల్లి లోని సర్వేనెంబర్ 92 లో గల 293 ఎకరాల భూమిని 2007 మంది రైతులు దశాబ్ద కాలంగా సాగు చేసుకుంటున్నారని, బడా బాబుల కోసం సాగు భూమిని లాక్కుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.