నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నుడా చైర్మన్ కేశ వేణు, పిసిసి కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ CM రేవంత్ రెడ్డి వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక నవరాత్రుల్లో వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్ణయించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. వినాయక మండపాల వారు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఉచిత విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్ మండపాలవారు డీజే లు నిషేధించబడ్డాయని, కావున డీజేలు పెట్టి శబ్ద కాలుష్యం ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు.