ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆదివారం నూతనకల్ ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.మండలంలోని మాచనపల్లి గ్రామ శివారులో గల వాగు నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు వస్తాయి తేలిపారు. యజమానులు బొల్లం చంద్రశేఖర్ పూల్లూరి నాగరాజు వంకుడోతు సాయిలపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.