ప్రకాశం జిల్లా కంభం బేస్తవారిపేట మండలాలలోని ఎరువుల దుకాణాలను బుధవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్యలో స్థానిక సీఐ మల్లికార్జున మరియు వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించడంతోపాటు ఎరువుల నిలువులను గుర్తించారు. రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఎటువంటి ఎరువుల కొరత లేదని అధికారులు తెలిపారు. ఎవరన్నా దుకాణదారులు ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ మల్లికార్జున వ్యవసాయ శాఖ అధికారులు అన్నారు.