యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని భారత దేశ విదేశాంగ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 25 దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధుల బృందం సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. శ్రీలంక, వియత్నం, థాయిలాండ్, ఈజిప్ట్, కెన్యా, ఘనా, ఇరాక్, క్యూబా వంటి దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వేద ఆశీర్వచనాలు పొందారు.