గ్రామాలు సమస్యలకు నిలయాలుగా మారాయని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి ఇటిక్యాల మండలంలోని బుడ్డారెడ్డి పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... గ్రామంలో సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయిందన్నారు.దీనితో దోమల బెడద ఎక్కువైందని ప్రజలు తమకు తెలియజేశారనీ ఆయన అన్నారు.ఫలితంగా ప్రజలకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్య, కలరా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.