రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం సేకరణకు సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా జాయిట్ కలక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు. సోమవారం కలక్టరేట్ లోని గౌతమీ సమావేశపు మందినరంలోని జిల్లాలోని రబీ సీజన్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలు నిర్వహణ పై జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశం నిర్వహించారు. జాయిట్ కలక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ 2023-2024 రబీ సిజన్ కు సంబంధించి120 రైతు భరోసా కేంద్రాలను ఏప్రిల్ 10వ తేదీ అనంతరం ధాన్యం సేకరణ కొరకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.