లడ్డూ అపహరణకు ఓ యువకుడు యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లిలోని లయన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం అర్ధరాత్రి లడ్డూ దొంగతనం చేయడానికి గుర్తుతెలియని యువకుడు యత్నించాడు. కాగా,ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పాటు సైరన్ రావడంతో ఆ యువకుడు పారిపోయాడు. ఇద్దరు యువకులు దొంగతనానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం మండప నిర్వహకులు మీడియాకి సీసీ కెమెరాలో రికార్డు దృశ్యాన్ని అందజేశారు.