కేసుల చేధనలో, నేరస్థులను గుర్తించడంలో జిల్లా పోలీస్ శాఖ మరింత బలోపేతం అయ్యేందుకు నూతన జాగిలం 'సోను' జిల్లా పోలీస్ శాఖకు రావడం జరిగిందని జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు. 'సోను' అనే బెల్జియం మలనాయిస్ జాతికి చెందిన నూతన జాగిలం మంగళగిరి హెడ్ హెడ్ క్వార్టర్స్ 6 వ బెటాలియన్ లో 10 నెలల పాటు శిక్షణ పొందిందన్నారు. గతంలో ఒక జాగిలానికి ఒకే ట్రైనింగ్ ఇచ్చేవారని, అంటే పేలుడు పదార్థాలు గుర్తించడం లేదా ట్రాకింగ్ అంశాల్లో ఒక దానిలోనే శిక్షణలో భాగంగా నేర్పించేవారు. ప్రస్తుత జాగిలానికి రెండు అంశాల్లో ప్రావీణ్యత పొందేలా తర్ఫీదు పొందిందన్నారు.