కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రుద్రంపూర్ గ్రామంలోని ఎర్రగడ్డ నివాసి కామేశ్వరరావు గత కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడని తెలిపారు. తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు... విషయం తెలుసుకున్న ఎస్సై కిషోర్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు... శెవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. మృతికి గల పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది..