Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 6, 2025
ఉలవపాడు సౌత్ బైపాస్లో హైవేపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణపై పోలీసులు దృష్టి పెట్టారు. కావలి వైపు నుంచి ఉలవపాడులోకి వచ్చే వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దాంతో హైవే నుంచి ఉలవపాడులోకి ఎంట్రీ మార్గాన్ని శనివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మూసేశారు. ఇక నుంచి కావలి వైపు నుంచి ఉలవపాడు వచ్చే వాహనాలు అండర్ పాస్ ద్వారా రావల్సి ఉంటుందని ఎస్ఐ అంకమ్మ తెలిపారు.