రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఎన్గల్ గ్రామ బై పాస్ రోడ్డు అధ్వానంగా మారి దర్శనమిస్తోంది. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని గుంతల మయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు. రాత్రి సమయంలో అనేక ప్రమాదాలు జరిగాయని ప్రయాణికులు వాపోతున్నారు. గుంతల్లో వర్షపునీరు నిలవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు.