కూటమి పార్టీలు తొలిసారిగా ఉమ్మడిగా అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ అదరహో అనిపించింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ప్రజల ఆశీర్వాదంతో తమ హిట్ కాంబినేషన్ కొనసాగుతుందని కూటమి నేతలు సభా వేదికగా ప్రకటించారు. అనంతపురంలోని ఇంద్రప్రస్తానగర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి 15 నెలల పాలనా విజయాలపై ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ బంపర్ హిట్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా కార్యకర్తలు పాల్గొన్నారు.