అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. యాడికిలోని ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ భవనంలో మంగళవారం అన్ని శాఖల మండల అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి యాడికి పంచాయతీకి సంబంధించిన ఆదాయం, వ్యయం గురించి పంచాయతీ ఇన్చార్జ్ ఈ.ఓ శశికళను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యాడికి గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేయడమే తన మొదటి లక్ష్యమని తెలిపారు. ఎక్కడైనా మంచినీటి సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు.