మైలార్ దేవ్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాబూల్ రెడ్డి నగర్లో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.